తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం సృష్టించిన నీలి విప్లవం మరో ఘనమైన చరిత్ర అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి (Jeevan Reddy) అభివర్ణించారు. అసెంబ్లీ (Assmebly) బడ్జెట్ సమావేశాలలో శనివారం ప్రశనోత్తరాల సమయంలో చేపల పెంపకంపై ఆయన ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే ఫస్ట్ అని హర్షం వ్యక్తం చేశారు. “చేపలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణఎదగడం హర్షణీయం. సహజ నీటి వనరులలో చేపల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం (Top Place)లో నిలిచింది.2014 కు ముందు మత్స్య రంగం పూర్తిగా నిరాదరణకు గురైంది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలి, కులవృత్తుల పై ఆధారపడిన వారి జీవితాలలో వెలుగులు నింపాలనే గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేసే కార్యక్రమం చేపట్టారు.
పూర్తిగా ధ్వంసమైన చెరువులు, కుంటలకు మిషన్ కాకతీయ కార్యక్రమంతో పూర్వ వైభవం వచ్చింది. కాళేశ్వరం వంటి నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో నీటి వనరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014 కు ముందు 1.90 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో మత్స్య సంపద 4 లక్షల టన్నుల కు పెరిగింది. మత్స్యకారులు తక్కువ ధరకే చేపలు అమ్ముకోకుండా సబ్సీడీపై వాహనాలతోపాటు ఫిష్ ఔట్‌లెట్ వాహనాలను సబ్సీడీపై సమకూర్చారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకుని ఆర్థికంగా, వృత్తిపరంగా అభివృద్ధి చెందాలని మత్స్యకారులకు (Jeevan Reddy) పిలుపునిస్తున్నా.
ప్రతి ఏటా జూన్ 7, 8, 9 తేదీల్లో జిల్లాల్లో మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపలు, రొయ్యలతో చేసిన వివిధ రకాల వంటకాలను ఫుడ్ ఫెస్టివల్ (Food Festival) ద్వారా ప్రజలకు పరిచ యం చేయాలనుకోవడం గొప్ప నిర్ణయం. మత్స్య సొసైటీలు, మత్స్యకారుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడం కోసం ఒక కమిటీని నియమించడాన్ని స్వాగతిస్తున్న. ఎన్నో సంవత్సరాలుగా అపరి ష్కృతంగా ఉన్న సమస్యలను ఈ కమిటీ పరిష్కరించింది. ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్న నాయకులు కూడా మనం పెంచిన చేపలు తింటున్నారు. సంతోషం.. వారు వారానికి మూడు సార్లు చేపలు తిని మంచి ఆరోగ్యంతో ఉండాలి. దేశం మురిసేలా కులవృత్తులు మీసం మెలేస్తున్నాయి.ఉట్టిపడుతున్న జలకళ వల్లే కులవృత్తులకు ప్రాణం వచ్చింది.దీనికి కర్మ,కర్త,క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. గ్రామగ్రామాన చేపల మార్కెట్లు ఏర్పాటు చేయాలి. చేపల ఉత్పత్తికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. ఇకనైనా విపక్షాలు విమర్శలు మానాలి. చేపల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్న”అని జీవన్ రెడ్డి (Jeevan Reddy) పేర్కొన్నారు.
Also Read: Valentine’s Day Restrictions: హద్దుమీరుతున్న ప్రేమికులు.. NITC యూనివర్సిటీ కఠిన ఆంక్షలు