Site icon HashtagU Telugu

Telangana: ఇది కేసీఆర్ అడ్డా.. ఇచ్చిపడేసిన హరీష్

Telangana (9)

Telangana (9)

Telangana: తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అడ్డా అంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణతో మీకు సంబంధం లేదని నడ్డాకు సూచించారు. అలాగే తెలంగాణాలో ఏ పార్టీకి కూడా గెలిచే సత్తా లేదని హరీష్ స్పష్టం చేశారు. మూడోసారి మళ్లీ బీఆర్‌ఎస్‌ మాత్రమే వస్తుందన్నారు. బీజేపీ డిపాజిట్ కమిటీ వేస్తే బాగుంటుందని. ఆలా చేయడం ద్వారా కనీసం డిపాజిట్లైనా వస్తాయని, ఆదిలాబాద్ జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన హరీశ్‌రావు ..కాంగ్రెస్ వట్టి మాటలకే పరిమితం అవుతుందన్నారు. సీఎం కుర్చీ కోసం మత జ్వాలలు రగిలించిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులూ అర‌చేతిలో వైకుంఠం చూపించి, క‌ర్ణాట‌క నుంచి డ‌బ్బులు సంచులు తెచ్చి గెల‌వాల‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారని హరీష్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తధ్యమని చెప్పిన హరీష్ కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ ఆట‌లు సాగ‌వని, తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో రాగానే ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతుందని చెప్పారు.పెన్ష‌న్లు ఎంత పెంచాలి.. రైతుబంధు ఎంత పెంచాలి.. మ‌హిళ‌ల‌కు ఇంకా ఏం చేయాల‌ని సీఎం కేసీఆర్ స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ని మంత్రి తెలిపారు.

తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు . మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడ్తనపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ .. లిఫ్ట్ ఇరిగేషన్‌కు 80.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని. ఈ లిఫ్టు ద్వారా 1 టీఎంసీ గోదావరి నీటిని ఎత్తిపోయనున్నట్లు తెలిపారు. గతంలో గోదావరి నుంచి వెళ్లే నీటికి ఇబ్బందులు ఉండేవని హరీష్ అన్నారు.

Also Read: YSRTP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా షర్మిల..?