Site icon HashtagU Telugu

Telangana: పెళ్లికి వెయ్యి మందిని పిలిచి 10 మందికి అన్నం పెట్టినట్టుంది: రేవంత్ పై బండి

Telangana

Telangana

Telangana: పేద కుటుంబాలకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మీరు ఏ ప్రాతిపదికన ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు . పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మంది బంధువులకు భోజనం వడ్డించినట్లు కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేశారు . గత ప్రభుత్వం మాదిరిగానే తాను రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయబోతున్నారా.. లేక మరో ప్రణాళికను అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని ప్రశ్నించారు. హామీలు నెరవేరుస్తామని ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ మాట మారుస్తోంది. షరతుల పేరుతో హామీల్లో కోత పెడుతున్నారు. పెళ్లికి వెయ్యి మందిని పిలిచి 10 మందికి అన్నం పెట్టడం ఎలా? 100 రోజుల్లోగా హామీలు నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజల చేతిలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలవుతుందని హెచ్చరించారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పర్యటించిన బండి సంజయ్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించారు. అందులో బీజేపీ సమస్యలను లేవనెత్తడం, అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడడం వల్లే కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిందని వ్యాఖ్యానించారు.

Also Read: PM Modi: బీజేపీ రూ. 2 వేల విరాళం ఇచ్చిన ప్ర‌ధాని మోదీ..!

Exit mobile version