Intermediate Summer Vacation Dates: రేప‌టి నుంచి సెల‌వులు.. జూన్ 1న కాలేజీలు ప్రారంభం..!

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (Intermediate Summer Vacation Dates) రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి మార్చి 30 చివరి పనిదినమని తెలియజేసింది.

Published By: HashtagU Telugu Desk
Intermediate Summer Vacation Dates

Inter Students

Intermediate Summer Vacation Dates: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (Intermediate Summer Vacation Dates) రాష్ట్రవ్యాప్తంగా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి మార్చి 30 చివరి పనిదినమని తెలియజేసింది. విద్యార్థుల‌కు వేసవి సెలవులు మార్చి 31 నుండి మే 31 వరకు ఉంటాయని తెలిపింది. తెలంగాణలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలలకు ఈ సెల‌వులు వర్తిస్తాయని పేర్కొంది. జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చివరి ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు జ‌రిగాయి. ఈ విద్యా సంవత్సరంలో 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4 లక్షల మంది ఉన్నారు. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించార‌ని బోర్డు పేర్కొంది.

Also Read: Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు

మూల్యాంకన ప్రక్రియ పురోగతిలో ఉందని, ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు బోర్డు తెలియజేసింది. పరీక్షలు పూర్తయిన 30 రోజుల తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంద‌ని బోర్డు అధికారులు గ‌తంలోనే తెలిపారు.

ఏపీలో ఏప్రిల్‌ 25 నుంచి వేసవి సెలవులు

మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల‌కు ప్ర‌స్తుతం ఒంటిపూట బడులు నిర్వ‌హిస్తున్నారు. ఈ ఒంటిపూట బడులు ఏప్రిల్‌ 24వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్కూళ్లకు వేస‌వి సెల‌వులు ఇవ్వ‌నున్నారు. అయితే 2024 జూన్ 13వ తేదీ వ‌రకు ఈ వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేస‌వి సెల‌వులు ఉండే అవ‌కాశం ఉంది. అయితే.. ఇంకా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు స్కూళ్లకు సంబంధించిన వేస‌వి సెల‌వులపై అధికారం ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 30 Mar 2024, 07:52 AM IST