Site icon HashtagU Telugu

TS Inter: ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు కీలక సూచనలు

తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ లో 70 శాతం సిలబస్ ఉండనున్నట్లు ప్రకటన చేసింది. మొదటి, రెండవ సంవత్సరం ‌విద్యార్థులకు 70 శాతం సిలబస్ నుండే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది.

కోవిడ్ వల్ల తెలంగాణలోని విద్యా సంస్థల్లో ఫిజికల్ క్లాసెస్ ఆలస్యంగా స్టార్ట్ కావడంతో సిలబస్ ను 70 శాతానికి కుదించామనిఇంటర్ బోర్డు తెలిపింది.

తగ్గించిన సిలబస్, ప్రస్తుతమున్న సిలబస్ పూర్తి వివరాలను ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ లో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
కరోనా వల్ల పోయిన అకాడమిక్ సంవత్సరంలో కూడా 70 శాతం సిలబస్తోనే నిర్వహించింది.

ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు మరో సారి పొడగిస్తున్నట్లు కూడా బోర్డు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఈ గడువును పలుమార్లు పెంచిన ఇంటర్ బోర్డు తాజాగా ఈ నెల 30 వరకు పొడగిస్తున్నట్లు తెలిపింది.

Exit mobile version