Site icon HashtagU Telugu

Inter Hall Tickets : నేటి నుంచే ‘ఇంటర్’ హాల్‌టికెట్స్ రిలీజ్.. ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదీ

Inter Hall Tickets

Inter Hall Tickets

Inter Hall Tickets : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు నేటి (ఫిబ్రవరి 19) నుంచి రిలీజ్ కానున్నాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా ఫస్టియర్ హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెకండియర్ చదువుతున్న వారు ఫస్టియర్ లేదాా సెకండియర్ హాల్‌టికెట్(Inter Hall Tickets)  నంబరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి సరిచేయించుకోవచ్చు.

ఫస్టియర్‌ ఎగ్జామ్స్ షెడ్యూల్ 

➥ 28-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I

➥ 01-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-I

➥ 04-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IA, బాటనీ పేపర్‌-I, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-I

➥ 06-03-2024: మ్యాథమేటిక్స్‌ పేపర్‌-IB, జువాలజీ పేపర్‌-I, హిస్టరీ పేపర్‌-I

➥ 11-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-I, ఎకనామిక్స్‌ పేపర్‌-I

➥ 13-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-I, కామర్స్‌ పేపర్‌-I

➥ 15-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-I, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-I

➥ 18-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-I, జాగ్రఫీ పేపర్‌-I

Also Read : 53 Killed : రోడ్డుపై 53 డెడ్‌బాడీస్.. గిరిజన తెగల ఘర్షణ రక్తసిక్తం

సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్..

➥ 29-02-2024: సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II

➥ 02-03-2024: ఇంగ్లిష్‌ పేపర్‌-II

➥ 05-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIA, బాటనీ పేపర్‌-II, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-II

➥ 07-03-2024: మ్యాథమెటిక్స్‌ పేపర్‌-IIB, జువాలజీ పేపర్‌-II, హిస్టరీ పేపర్‌-II

➥ 12-03-2024: ఫిజిక్స్‌ పేపర్‌-II, ఎకనామిక్స్‌ పేపర్‌-II

➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్‌-II, కామర్స్‌ పేపర్‌-II

➥ 16-03-2024: పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-II, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-II

➥ 19-03-2024: మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-II, జాగ్రఫీ పేపర్‌-II

Also Read :MSP 5 Years : ఐదేళ్లు పంటలకు ‘మద్దతు’ ధర.. కేంద్రం ప్రపోజల్.. ‘చలో ఢిల్లీ’ ఆపేసిన రైతులు