Telangana IAS Transfers : తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీలు

తెలంగాణ (Telangana )లో అధికారుల బదిలీలు ఆగడం లేదు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారం చేపట్టిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున అన్ని శాఖల్లో అధికారులను బదిలీలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది బదిలీలు కాగా..తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. We’re […]

Published By: HashtagU Telugu Desk
Six Ias Officers Transfer I

Six Ias Officers Transfer I

తెలంగాణ (Telangana )లో అధికారుల బదిలీలు ఆగడం లేదు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారం చేపట్టిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున అన్ని శాఖల్లో అధికారులను బదిలీలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది బదిలీలు కాగా..తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

* సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ
* సిద్ధిపేట నూతన కలెక్టర్ గా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని నియమించింది.
* వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్‌ బాషాను జనగాం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది.
* అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.
* ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇంతకాలం ఆ బాధ్యతలు (అదనపు హోదాలో) చూస్తున్న సునీల్ శర్మను అక్కడి నుంచి రిలీవ్ చేసింది రాష్ట్ర సర్కార్.

Read Also : Tirumala : తిరుమల చుట్టుప్రక్కల ఉన్న ఈ ప్రదేశాలు ఎంతబాగుంటాయో..!!

  Last Updated: 23 Feb 2024, 02:53 PM IST