Site icon HashtagU Telugu

Polluted Cities: పొల్యూటెడ్ సిటీస్ లో హైదరాబాద్.. 4వ స్థానం మనదే!

Hyderabad Buildings

Hyderabad Buildings

దేశంలోని ప్రధాన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత హైదరాబాద్ కాలుష్య నగరంగా (నాల్గవ) ర్యాంక్ లో నిలిచింది. ఇది దేశంలోని దక్షిణ భాగంలో అత్యంత కలుషితమైన సిటీగా నిలిచింది. హైదరాబాద్ వాయు కాలుష్యంలో మూడో వంతు వాహనాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో PM2.5 గాఢత ఒక క్యూబిక్ మీటర్ గాలికి 70.4 మైక్రోగ్రాములు.

ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్షిక గాలి నాణ్యత మార్గదర్శక విలువ కంటే 14.1 రెట్లు. ఇంధనాల దహనం, పారిశ్రామిక సంస్థల నిర్మాలు, ల్యాండ్‌ఫిల్ తోడు హైదరాబాద్‌లో గాలి నాణ్యత క్షీణించడానికి వాహన కాలుష్యమే అతిపెద్ద కారణమని తెలుస్తోంది.  ఆరోగ్య సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న కణాలు మానవ ఆరోగ్యానికి గొప్ప ప్రమాదాన్ని కలిగిస్తాయని అంటున్నారు. ఇప్పటినుంచైనా హైదరాబాద్ ప్రజలు తేరుకోకపోతే ఢిల్లీ పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.