Site icon HashtagU Telugu

2024 Holidays List : 2024లో ప్రభుత్వ సెలవులు ఎన్ని వచ్చాయో తెలుసా..?

Telangana Holidays List 202

Telangana Holidays List 202

మరో 19 రోజుల్లో కొత్త ఏడాదిలోకి (New Year) వెళ్ళబోతున్నాం..దీంతో ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) ఫై ప్లాన్ చేసుకుంటూ..ఈ ఏడాది (2023) మొత్తంలో ఏ ఏ మంచి పనులు చేసాం..ఏ ఏ చెడ్డ పనులు చేసాం..వచ్చే ఏడాది లో ఏంచేయాలి..ఎలాంటి మార్పులు చేసుకోవాలి…వంటి వాటిపై మాట్లాడుకుంటున్నారు. అలాగే రాబోయే ఏడాదిలో ఎన్ని సెలవులు (2024 Holidays ) రాబోతున్నాయో కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో 2024 ఏడాదికి సంబంధించిన సెలవులను తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రకటించింది.

2024 ఏడాదిలో సాధార‌ణ సెల‌వులు 27, ఐచ్చిక సెల‌వులు 25 ఉండ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్రభుత్వం సూచించిన ఈ 25 రోజుల్లో ఏవేని ఐదింటిని వాడుకోవచ్చని సూచించింది. ప్రతి నెలా రెండో శనివారాన్ని సెలవుగా ప్రకటించినా ఫిబ్రవరిలో మాత్రం వర్కింగ్‌డే గా ఉంటుందని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి ఫస్ట్‌కు హాలిడే ప్రకటించగా.. ఆ సెలవును దీంతో అడ్జస్ట్ చేసింది. శివరాత్రి పండుగ మార్చి 8న గురువారం రాగా.. ప్రభుత్వం శుక్రవారం సెలవు ఇచ్చింది. ఆ తర్వాతి రోజు రెండో శనివారం రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. జ‌న‌వ‌రి 15న సంక్రాంతి సెల‌వు, మార్చి 8న మ‌హా శివ‌రాత్రి, మార్చి 25న హోలి, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామ‌న‌వమి, జూన్ 17న బ‌క్రీద్, సెప్టెంబ‌ర్ 7న వినాయక చ‌వితి, అక్టోబ‌ర్ 10న ద‌స‌రా, అక్టోబ‌ర్ 31న దీపావ‌ళికి సెల‌వులు ప్ర‌క‌టిస్తూ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

Read Also : Gas Cylinder : త్వరలోనే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించబోతున్నాం – మంత్రి ఉత్తమ్