Telangana History; తెలంగాణ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉన్నదని, నేటి తరానికి తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై అవగాహన కల్పించాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ జాగృతి సంస్థ ప్రచురించిన ఐదు తెలంగాణ చరిత్ర పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి అనేక చరిత్ర ఉంది. ఇప్పుడున్న జనరేషన్ కి తెలంగాణ ఉజ్వల చరిత్రపై అవగాహన కల్పించాలి. ఈ ప్రాంతానికి 20 వేల కోట్ల చరిత్ర ఉన్నదని సీఎం కెసిఆర్ చెప్పారు. తెలంగాణ గడ్డపై వేల సంవత్సరాల క్రితమే మానవ ఆవాసాలు ఉన్నట్టు తేలిందని చెప్పారు. ఈ సందర్భంగా భారత్ జాగృతి సంస్థ చరిత్ర విభాగం ఈ పుస్తకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అభినందనీయమని, ఈ పుస్తకాలు నేటి, భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు సీఎం కెసిఆర్.
భారత జాగృతి చరిత్ర విభాగం గత 6 సంవత్సరాలుగా తెలంగాణలోని అనేక చారిత్రక ప్రదేశాలను సందర్శించి, దాదాపు 20 కోట్ల సంవత్సరాల పైబడిన చరిత్ర యొక్క ఆనవాళ్లు తెలంగాణలో గుర్తించి, రచయిత శ్రీరామోజు హరగోపాల్, సంపాదకులు మామిడి హరికృష్ణ, వేముగంటి మురళీకృష్ణల ఆధ్వర్యంలో పుస్తక రూపంలో పొందుపరచడం గర్వకారణమని, ఇది భావి తరాలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
Read More: Pawan Kalyan Yagam: ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం కోసం ‘పవన్’ యాగం!