Site icon HashtagU Telugu

BRS : ఆ ఇద్దరి ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..

Malla Palla

Malla Palla

బిఆర్ఎస్ (BRS) పార్టీకి ఏమాత్రం కలిసిరావడం లేదు..అధినేత కేసీఆర్ (KCR) కు మాత్రమే కాదు..ఆ పార్టీలోని ఎమ్మెల్యేలకు కూడా వరుస షాకులు ఎదరవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరుపున గెలిచిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy ) , అలాగే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ( Palla Rajeshwar Reddy) లకు హైకోర్టు నోటీసులు (Telangana High court Notice) జారీ చేసింది. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ హైకోర్టులో పిర్యాదు చేసాడు. మల్లారెడ్డి సూరారంలో భూమి ఉందని తెలిపారు. అయితే ఆ భూమి ప్రభుత్వానికి చెందిందని వజ్రేష్ యాదవు తెలిపారు. అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా తన అఫిడవిట్ లో బ్యాంకు ఖాతాలు వెల్లడించలేదని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ జె.శ్రీనివాస్‌ రావులతో కూడిన సింగల్ బెంచ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ పోగుల వాదనలు వినిపిస్తూ.. రిటర్నింగ్‌ అధికారికి చామకూర మల్లారెడ్డి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్నారు. సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారని.. రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి, నాలాగా ఉందని వాదనలు వినిపించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో వారిద్దరికీ కోర్ట్ నోటీసులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కేసీఆర్ ఫై కూడా ఈసీ నిషేధం విధించింది. కాంగ్రెస్ పార్టీ ఫై పలు ఆరోపణలు చేసారని కాంగ్రెస్ పిర్యాదు చేయడం తో రెండు రోజుల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆదేశించింది ఈసీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు మీద ఉన్న కేసీఆర్ కు ఈసీ ఆదేశం భారీ షాక్ కు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్..ఈ లోక్ సభ ఎన్నికల తో తమ సత్తా చాటాలని సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలో బస్సు యాత్ర తో ప్రజల ముందుకు రావడం మొదలుపెట్టారు. ప్రజలు సైతం కేసీఆర్ యాత్రకు బ్రహ్మ రథం పడుతూ వస్తున్నారు. ఎక్కడిక్కడే తమ సమస్యలు చెప్పుకుంటూ మీ పాలనే బాగుంది సర్ అంటూ చెపుతుండడం తో కేసీఆర్ లో జోష్ పెరిగింది. ఇదే స్థాయిలో ప్రచారం చేయాలనీ..ప్రజలకు దగ్గర కావాలని అనుకున్నాడు. కానీ ఈసీ నిషేధం విధించడంతో ఆయన అనుకున్నవి తారుమారయ్యాయి. మరి నిషేధ గడువు తర్వాత కేసీఆర్ తన దూకుడును కొనసాగిస్తారా నేది చూడాలి.

Read Also : Shyam Rangeela : ప్రధాని మోడీపై మిమిక్రీ మ్యాన్ శ్యామ్ రంగీలా పోటీ.. ఎవరు ?