Summer Holidays : తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 5 నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మే 7, 14, 21, 28, జూన్ 4వ తేదీల్లో కోర్టులు కేసుల విచారణ చేపడతాయన్నారు. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, ట్రయల్ కోర్టు తిరస్కరించిన వాటిపై బెయిల్ అప్లికేషన్లు, ఇతర అత్యవసర కేసులను సెలవుల్లోని బెంచ్‌ల వద్ద ఫైలింగ్ చేయొచ్చని చెప్పారు. లంచ్ మోషన్ కేసులు, అత్యవసర పిటిషన్ల మెన్షన్ (విచారణ కోరడం)లపై డివిజన్ బెంచ్‌లో సీనియర్ న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు.
Read Also: YS Sharmila: ఏపీలో ప్రధాని మోదీ టూర్.. వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్!
మే7న జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో బెంచ్, జస్టిస్ పుల్లా కార్తీక్ సింగిల్‌గా విచారణ చేపడతారన్నారు. మే 14న జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావుల బెంచ్, జస్టిస్ జె.శ్రీనివాసరావు సింగిల్, మే 21న జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావులతో బెంచ్; జస్టిస్ జె.శ్రీనివాసరావు సింగిల్, మే 28న జస్టిస్ నగేష్ భీమపాక, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన బెంచ్, జస్టిస్ కె.శరత్ సింగిల్, జూన్ 4న జస్టిస్ కె.శరత్, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్‌రావులతో కూడిన బెంచ్, జస్టిస్ కె.సుజన సింగిల్ బెంచ్‌లలో విచారణ చేపడతారన్నారు. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్, కూల్చివేతలు తదితర అత్యవసర కేసులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు.