NTR Statue: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హై కోర్టు స్టే

ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఖమ్మంలో ప్రతిష్టించాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి పోలికలతో రూపొందించారు.

NTR Statue: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఖమ్మంలో ప్రతిష్టించాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి పోలికలతో రూపొందించారు. దీంతో వివాదం చెలరేగింది. యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నేడు కోర్టు విచారించింది. ఈ మేరకు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు కోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు విగ్రహాన్ని ప్రతిష్టించవద్దు అంటూ పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలోని లకారం పార్క్ , తీగల వంతెన వద్ద ఏర్పాటు చేసేందుకు మంత్రి పువ్వాడ నిర్ణయించారు. 54 అడుగుల భారీ విగ్రహాన్ని 2.2 కోట్లతో తయారు చేయించారు. ఎన్టీఆర్ వందో జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని మే 28న ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. మంత్రి పువ్వాడ స్వయంగా జూనియర్ని కలిసి విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఆహ్వానించారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడి పోలికలతో ఉండటంతో యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నది.

Read More: KTR : హైదరాబాద్‌కి వార్నర్ బ్రో సంస్థ.. KTR అమెరికా టూర్ లో పెద్ద సంస్థనే తెస్తున్నారుగా..