Danam Nagender : ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని విజయా రెడ్డి తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు

Published By: HashtagU Telugu Desk
Tg Shock Danam

Tg Shock Danam

తెలంగాణ హైకోర్టు (TG High Court) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) కు షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో PJR కూతురు విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాలంటూ దానంకు నోటీసులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని విజయా రెడ్డి తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అలాగే.. తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని పిటిషన్ లో తెలిపారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ దానంకు నోటీసులు జారీ చేసింది. విచారణ వచ్చే నెల 18వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరుపున విజయం సాధించిన దానం..రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ లో చేరి..సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ గా పోటీ చేయబోతున్నారు. మరి ఇప్పుడు కోర్ట్ ఆదేశాలతో ఏంచేయబోతారనేది చూడాలి.

Read Also  : Water Crisis in Hyderabad : హైదరాబాద్ కు పెను ప్రమాదం పొంచి ఉందా..?

  Last Updated: 22 Mar 2024, 04:36 PM IST