Telangana High Court : మసీదుల్లోకి మహిళలను అనుమతించాలి – తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు ( Verdict) జారీ చేసింది. మసీదు. జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలంటూ (Allow Women In Mosques) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానమేనని హైకోర్టు పేర్కొన్నది. శని శింగనాపూర్‌, హాజీ అలీ దర్గా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల […]

Published By: HashtagU Telugu Desk
Ts Hc

Ts Hc

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు ( Verdict) జారీ చేసింది. మసీదు. జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలంటూ (Allow Women In Mosques) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానమేనని హైకోర్టు పేర్కొన్నది. శని శింగనాపూర్‌, హాజీ అలీ దర్గా, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల పరంపరలో రాష్ట్ర హైకోర్టు ముస్లిం మహిళలకు సంబంధించి ఓ సంచలన తీర్పు వెలువరించింది. మసీదులు, జషన్‌లతోపాటు ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించాలని వక్ఫ్‌ బోర్డును ఆదేశిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మహిళలు పురుషులకంటే ఏమాత్రం తక్కువ కాదని అభిప్రాయపడింది. పురుషుడికంటే స్త్రీ ఎలా తక్కువ అవుతుందని ప్రశ్నించింది. దేవుని ముందు స్త్రీ పురుషులందరూ సమానులేనని, దేవునికి లింగ వివక్ష ఉండదని స్పష్టంచేసింది.

We’re now on WhatsApp. Click to Join.

షియా ముస్లిం మహిళలను మసీదు, ఇతర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు అనుమతించట్లేదంటూ ‘అంజుమన్ ఎ అలవి షియా ఇమామియా ఇత్నా అశరి (అక్బరీ) సొసైటీ’ కార్యదర్శి ఆస్మా ఫాతిమా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై హైకోర్టు జడ్జి జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం విచారణ చేపట్టారు. ఇబ్దత్‌కానాకు చెందిన ముత్తవల్లీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను ప్రార్థనా మందిరాలకు అనుమతించడంలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఉపయోగం లేకపోయిందని తెలిపారు.

Read Also : Raj Bhavan : రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు కాల్.. బెంగళూరులో కలకలం

  Last Updated: 12 Dec 2023, 11:24 AM IST