Site icon HashtagU Telugu

Telangana High Court: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై.. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు..!

Suspension Of Bjp Mlas High Court

Suspension Of Bjp Mlas High Court

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు మొదలైన తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు సస్పెండ్ అయిన సంగ‌తి తెలిసిందే. స‌భ‌లో బడ్జెట్ ప్రసంగానికి అడ్డు పడుతున్నారన్న కారణంగా ఈ ముగ్గురిని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేశారు. అంతే కాకుండా ఈసారి శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలో తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈరోజు విచార‌ణ జ‌రిపిన తెలంగాణ హైకోర్టు బుధవారం రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. ఈట‌ల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు తమను శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు సభ నుండి సెషన్‌కు సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తమను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యేలు ఆరోపించారు.

ఈ క్ర‌మంలో వారి సస్పెన్షన్‌ శాసన సభ నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధమని వారి తరపు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదించారు. సభ నియమావళికి విరుద్ధంగా సస్పెండ్ చేశారంటూ కోర్టుకు వివరించారు. రాజ్యంగ విరుద్ధంగా వ్యవహరించి.. సస్పెండ్ చేశారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, మరియు 194ల‌ను ఉల్లంఘించినట్లుకోర్టుకు విన్నవించారు. ను సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. శాసనసభలో ఏ సమావేశంలోనైనా ఇది సాధారణ సంఘటన అని, గతంలో అనేక సందర్భాల్లో ఇలా జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే మ‌రోవైపు అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఎమ్మెల్యేల సస్పెన్షన్​పై అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ.. ఈ కేసుపై విచారణ వాయిదా వేసింది. ఇక అసెంబ్లీలో తొలి రోజు ఆర్థిక మంత్రి హరీష్‌ రావు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే సభలోని బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పదేపదే ప్రసంగానికి అడ్డు తగులుతుండ‌డంతో, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావులను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ క్ర‌మంలో హరీష్‌ రావు ప్రసంగాన్ని కాసేపు ఆపిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ముగ్గ‌రు బీజేపీ ఎమ్మెల్యేల‌ను సభ నుంచి సస్పెండ్‌ చేయాల్సిందిగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ముగ్గురినీ ఈ సెషన్‌ పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేయాలని మంత్రి త‌ల‌సాని ప్రతిపాదించ‌గా, వెంట‌నే ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. దీంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీక‌ర్ పోచారం స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.