బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు (Telangana high court) భారీ ఊరట కల్పించింది. నల్లగొండలో దీక్ష (BRS Diksha Divas) నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభ్యర్థనకు కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం.. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష కు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించింది. బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచన ఉండగా, నల్లగొండ పోలీసులు దీని కోసం పర్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ దీక్షకు అనుమతి ఇవ్వాలని వారు కోర్టు ముందు వాదనలు వినిపించారు.
HUDCO : అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు హడ్కో నిర్ణయం
హైకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థనను పరిశీలించింది. షరతులతో కూడిన అనుమతిని ఇస్తూ, దీక్ష సమయంలో శాంతి భద్రతలు పాటించాల్సిందిగా స్పష్టం చేసింది. సభ సజావుగా జరిగేలా పార్టీ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహం మొదలైంది. ఈ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, పలువురు నాయకులు హాజరు కానున్నారు.