Site icon HashtagU Telugu

YS Sharmila Padayatra: షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

sharmila

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాదయాత్రలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని షర్మిలకు కోర్టు సూచించింది. సీఎం కేసీఆర్ పై ఎలాంటి రాజకీయ పరమైన, మతపరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు షరతు విధించింది. షర్మిల పాదయాత్రకు అనుమతించాలంటూ వైఎస్సార్టీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది.

3,500 కిలో మీటర్ల మేర ప్రశాంతంగా సాగిన షర్మిల పాదయాత్రకు వరంగల్ జిల్లా నర్సంపేట పోలీసులు అనుమతి నిరాకరించారని వైఎస్సార్టీపీ తన పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేసింది. వరంగల్ జిల్లా లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు యాత్రపై దాడికి యత్నించారని ఆరోపించింది. ఈ పిటిషన్ పై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు… షర్మిల పాదయాత్రకు అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.