Site icon HashtagU Telugu

TS High Court: ఆర్ఆర్ఆర్ కు ‘హైకోర్టు’ గ్రీన్ సిగ్నల్!

Rrr

Rrr

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. అల్లూరి సౌమ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, మహానుభావులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల ప్రతిష్టను ఏమీ దెబ్బతీయదని ప్యానెల్ వ్యాఖ్యానించింది.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రలు వారి జీవన శైలికి విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. అల్లూరి సీతారామరాజును పోలీసుగా చిత్రీకరించారని పిటిషనర్‌ ఆరోపించారు. ఈ కోర్టును ఆశ్రయించే ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) జారీ చేసిన సర్టిఫికేట్‌ను సవాలు చేయవలసి ఉంటుందని ప్యానెల్ సూచించింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లను దేశభక్తులుగా చిత్రీకరించారని, ఈ చిత్రం కల్పిత కథ అని చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది. కల్పిత కథ సినిమా స్వేచ్ఛను అనుమతించింది. ఈ మేరకు కేసును కొట్టివేయబడింది.

Exit mobile version