Governor Kota MLCs : ప్రొఫెసర్ కోదండరామ్‌కు తెలంగాణ హైకోర్టు షాక్

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 03:21 PM IST

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, ఆమీర్ అలీఖాన్ లు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కోదండరాం, అమీర్ అలీఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సవాల్ చేశారు. దీంతో విచారణ జరిపిన కోర్ట్.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి తీర్పు వచ్చేవరకు వెయిట్ చేయాలనీ తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అనేక వర్గాలను, సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోదండరామ్ కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారమే కోదండరామ్‌కు కీలక పదవి వ అప్పగించారు. కానీ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. మరి ఫైనల్ తీర్పు ఏమిఇస్తుందో చూడాలి.

Read Also : AP Special Status : ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా..