Site icon HashtagU Telugu

Weather Update : రేపటి నుంచి హైదరాబాద్‌ నిప్పుల కుంపటేనట..!

Hyderabad Weather Updates

Hyderabad Weather Updates

Weather Update : తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది, జనవరి చివరి వారం నుంచే సూర్యుడు తన ప్రభావాన్ని చూపించసాగాడు. ఫిబ్రవరిలో, పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 7 గంటల తర్వాత బయటికి వెళ్లడంలో ప్రజలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది, దీంతో హైదరాబాద్‌ సహా ఇతర ప్రధాన నగరాల్లో రోడ్లు ఖాళీగా మారాయి. మధ్యాహ్నం వేళల్లో, ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు.

Astrology : ఈ రాశివారికి నేడు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు

రేపటి నుంచి (మార్చి 2) రాష్ట్రం మరింత వేడిగా మారనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మార్చి 2 నుంచి 5 వరకు, తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38-40 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 36-38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మార్చి 6-8 తేదీలలో, రాత్రి, ఉదయం ఉష్ణోగ్రతలు కొద్దిగా చల్లగా ఉండే అవకాశం ఉంది, కానీ పగటి ఉష్ణోగ్రత 1-2 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. మార్చి 8 తర్వాత, ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.

శుక్రవారం, భద్రాచలంలో 38.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఎండల తీవ్రత పెరిగే నేపథ్యం లో నిపుణులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లాలని, బయటకు వెళ్లినప్పుడు సౌకర్యవంతమైన కాటన్ దుస్తులు ధరించాలని, తలపై గొడుగు లేదా జేబు రుమాల్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి పానీయాలు తీసుకుంటూ, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే, మసాలా ఆహారం, ఎక్కువ ఒత్తిడి చేసే పనుల నుంచి దూరంగా ఉండాలని, తరచుగా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

New Rations Card : దరఖాస్తుదారుల్లో అయోమయం.. రేషన్‌ కార్డులపై అప్డేట్‌..