Site icon HashtagU Telugu

TS Health Director: సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్.. వీడియో వైరల్!

Health Director

Health Director

తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమక్షంలో విధేయత ప్రదర్శించి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆ అధికారి సీఎం పాదాలను రెండుసార్లు తాకడం చర్చనీయాంశమవుతోంది. ఫోటో సెషన్‌లో సీఎం పాదాలను తాకుతున్న శ్రీనివాస్ ను చూడొచ్చు. కేసీఆర్ బిజీగా ఉండటంతో  ఒక నిమిషం తర్వాత మళ్లీ సీఎం కాళ్లపై పడతాడు. ప్రజారోగ్య నిపుణుడు కరోనావైరస్ మహమ్మారి తీవ్ర స్థాయిలో  ఉన్న సమయంలో చురుగ్గా పనిచేసి వార్తల్లో ఉండేవారు.

పబ్లిక్ ఇమేజ్ బాగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఉన్నత స్థాయిలలో తన ప్రభావం పెంచుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఎనిమిది మెడికల్ కాలేజీల వర్చువల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఇది రికార్డు అని ప్రభుత్వం పేర్కొంది. అదే రోజు కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కొత్త మెడికల్ కాలేజీల వర్చువల్ లాంచ్ తర్వాత రెండుసార్లు సీఎం #KCR పాదాలను తాకారు. 8 జిల్లాల్లో కొత్తగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య సంస్థల్లో విద్యా సంవత్సరాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు.