Bathukamma Celebrations: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ వేడుకలు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. చిన్న, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా ప్రతిఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. నీటి కుంటల వద్ద మహిళల నృత్యాలు అబ్బురపరుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లోనూ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. హైదరాబాద్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి (Shilpa Reddy)కి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి అనుమతి మంజూరు చేసిన నేపథ్యంలో శుక్రవారం చార్మినార్ బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం భాగ్యలక్ష్మి దేవాలయం (Bhagyalakshmi temple) సమీపంలో జరుగుతుంది. 100 మంది మంత్రమే పాల్గొనేందుకు కోర్టు అనుమతి కాపీలో పేర్కొంది. సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య ఈ వేడుకలు జరుగుతాయి.
పాతబస్తీ ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకల నేపథ్యంలో కఠిన షరతులు విధించాలని చార్మినార్(Charminar) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా డీజేని నిషేదించారు. వేడుకల్లో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు ఉండకూడదు. అంతేగాక బతుకమ్మ ఉత్సవాలకు వీఐపీలను అనుమతించరు. భాగ్యలక్ష్మి ఆలయంలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలన్న తన అభ్యర్థనను ఏసీపీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ శిల్పా రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!