Site icon HashtagU Telugu

BAS Scheme: రేవంత్ ప్రభుత్వానికి హరీశ్ విజ్ఞప్తి, ఆ పధకానికి నిధులు విడుదల చేయండని రిక్వెస్ట్

Harish Rao on BAS scheme

Harish Rao on BAS scheme

BAS Scheme: బిఎఎస్ పథకానికి నిధులు వెంటనే విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు లేఖ రాశారు. రాష్ట్రంలోని 25,000 మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కో సం నిధులు విడుదల చేయాలని హరీష్ రావు కోరారు.

తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు రాసిన లేఖలో హరీశ్‌రావు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023-24 విద్యా సంవత్సరంలో రూ.130 కోట్లు కేటాయించారని, మొదటి విడతగా రూ.50 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా నిలిచిపోయిన రూ.80 కోట్లు విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (BAS) స్కీమ్ కోసం నిధుల విడుదలలో జాప్యాన్ని అత్యవసరంగా మీ దృష్టికి తీసుకురావడానికి లేఖ రాస్తున్నాని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25,000 మంది పేద విద్యార్థుల చదువుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన వారు 18,000 మంది, ఎస్టీ వర్గాలకు చెందిన వారు 7,000 మంది ఉన్నారు. ఈ విద్యార్థులలో చాలా మంది రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాల నుండి వచ్చారు. ఎస్సీ, ఎస్టీల విద్యాభివృద్ధికి అనుబంధంగా ఉన్న నిధులు విడుదల కాకపోవడంపై సిద్దిపేట ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద నిధుల పెరుగుదలను నొక్కిచెప్పిన రావు, ప్రతి సంవత్సరం ఈ సుమారు 130 కోట్లు కేటాయిస్తుంది. ఈ పథకం కింద డే స్కాలర్‌లు ఒక్కో విద్యార్థికి 28,000, హాస్టళ్లలో ఉన్నవారు 42,000 పొందుతారు.

2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత కేవలం 8,000 మంది విద్యార్థులకు మాత్రమే ఆసరా ఉందని హరీశ్‌రావు హైలైట్‌ చేశారు. ప్రభుత్వం డే స్కాలర్‌కు రూ.8,000, హాస్టలర్‌లకు రూ.20,000 అందించిందని ఆయన తెలిపారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పేద విద్యార్థుల విద్య పట్ల తన నిబద్ధతను చూపిస్తూ, ఎటువంటి మార్పులు లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించిందన్నారు హరీష్. కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించారని చెప్పారు. ఈ పథకంలో పాల్గొనే పాఠశాలల సంఖ్యను 80 నుండి 150కి మరియు విద్యార్థుల సంఖ్యను ఏటా 8,000 నుండి 25,000 కు పెంచారని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థికి నిధులను కూడా పెంచాడని హరీష్ తెలిపారు.

Also Read: Hyderabad : పార్కింగ్ ‘ఫీజు’ విషయంలో వెనక్కి తగ్గిన మెట్రో