Site icon HashtagU Telugu

TSRTC merger bill: హైడ్రామాకు తెర .. RTC విలీన బిల్లుపై సంతకం చేసిన గవర్నర్

TSRTC

New Web Story Copy 2023 08 05t174104.475

TSRTC merger bill: టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించారు. బిల్లుపై పది గంటల పాటు హైడ్రామా నడించింది. ఆమె పుదుచ్చేరిలో ఉండటం, టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులు రాజ్ భవన్ ని ముట్టడించడం, గంటల సమయంలోనే ఆమె బిల్లుని ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఆమోదం పొందిన బిల్లు చట్టంగా మారాలంటే అది అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. దీంతో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించనుంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత టిఎస్‌ఆర్‌టిసి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా నిమతులవుతారు. బిల్లుపై సంతకం చేయడంతో టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులు గవర్నర్ తమిళిసైకి కృతజ్ఞతలు తెలిపారు. TSRTC ఉద్యోగులు మాట్లాడుతూ, మా ప్రయోజనాలను పరిరక్షించడంపై చూపుతున్న నిరంతర శ్రద్ధ పట్ల మేము సంతోషిస్తున్నామని తెలిపారు.

అంతకుముందు గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. దానికి ప్రభుత్వం చాలా వేగంగా గవర్నర్‌కు పాయింట్ టు పాయింట్ క్లారిఫికేషన్ పంపింది.దీంతో గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలించి శనివారం సాయంత్రం బిల్లుపై సంతకం చేసి ఆమోదించారు. రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే ప్రతిపాదిత బిల్లును సిఫారసు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్ కార్యదర్శికి రాసిన లేఖలో గవర్నర్‌ను అభ్యర్థించారు. జులై 31న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. బిల్లు ఆమోదం పొందితే 43,373 మంది కార్పొరేషన్‌ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా పరిగణించాలి.

Also Read: INDIA Meet-Mumbai : “ఇండియా” కూటమి మూడో సమావేశం ముంబైలో.. ఉద్ధవ్ థాక్రే శివసేన ఆతిథ్యం