Site icon HashtagU Telugu

Telangana: కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాల ప్రక్రియ వేగవంతం

Telangana

Telangana

Telangana: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 54 కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాలు జరిగాయి. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టగానే గత ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు, పదవీ కాలం పొడిగింపు నిర్ణయాలను రద్దు చేసింది.ఈ నేపథ్యంలో కొందరు కార్పొరేషన్ల ఛైర్మన్లు రాజీనామా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు సంబంధించి ఛైర్మన్ల నియామకాల ప్రక్రయ వేగవంతం చేయనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి 35 లేదా 36 కార్పొరేషన్ల ఛైర్మన్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పార్టీలో చురుగ్గా పని చేసి పార్టీకి సేవలందించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నామినేట్ పదవులను అప్పగించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం. సమాచారం మేరకు పలువురి పేర్లు ఇప్పటికే ఖరారు అయ్యాయట. వారి వివరాలు చూస్తే..

పటేల్ రమేష్​ రెడ్డి
నేరెళ్ల శారద
నూతి శ్రీకాంత్ గౌడ్
రాయల నాగేశ్వరరావు
బండ్రు శోభారాణి
ఎన్. ప్రీతమ్
శివసేనారెడ్డి
ఈరవత్రి అనిల్
జగదీశ్వరరావు (కొల్లాపూర్)
మెట్టు సాయికుమార్
గుర్నాథ్ రెడ్డి (కొడంగల్)
జ్ఞానేశ్వర్ ముదిరాజ్
బెల్లయ్య నాయక్
ప్రకాష్​ రెడ్డి (భూపాలపల్లి)
జంగా రాఘవరెడ్డి
ఇనుగాల వెంకట్రామి రెడ్డి
రియాజ్
కాల్వ సుజాత
కాసుల బాలరాజు (బాన్సువాడ)
నిర్మలా గౌడ్ (జగ్గారెడ్డి సతీమణి) తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే 35 మందిలో మిగతా వారెవరెవరనే వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: YSRCP: ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల

Exit mobile version