Pension : దివ్యాంగుల పెన్షన్ రూ. వెయ్యి పెంచిన తెలంగాణ సర్కార్

దివ్యాంగులకు తీపి కబురు తెలిపింది తెలంగాణ సర్కార్

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 08:12 PM IST

దివ్యాంగులకు తీపి కబురు తెలిపింది తెలంగాణ సర్కార్. దివ్యాంగుల పెన్షన్ (Disabled Persons Pension) ను రూ. వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వూలు జారీచేసింది. ఈ నెల నుండే పెంచిన వెయ్యి రూపాయిలు అందించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ (Telangana ) లో వృద్దులకు , వితంతువులకు , ఒంటరి మహిళలకు , వికలాంగులకు అత్యధిక పెన్షన్ ను కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాకముందు రూ. 200 ఉన్న పెన్షన్.. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేలు చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా రూ. 4016 లకు పెన్షన్ ను పెంచి కేసీఆర్ (CM KCR) తన గొప్ప మనసు చాటుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు. ఈమధ్యనే వెనుకబడిన తరగుతుల్లో కులవృత్తులు చేసుకునేవారికి లక్ష రూపాయల ఆర్థికసాయం అంజేశారు. ఇక ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్‌ మొత్తాన్ని రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచారు. ఈ నెల నుండి దివ్యాంగులు రూ.4,016 అందుకోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో దివ్యాంగులతో పాటు రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : BRS Minister: అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ