Mask Mandatory:తెలంగాణ ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాల వెనుక అర్ధం ఇదేనా

తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సూచనలు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తోంటే తెలంగాణాలో కరోనా పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - December 2, 2021 / 10:39 PM IST

తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సూచనలు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తోంటే తెలంగాణాలో కరోనా పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు.

మాస్క్ వాడడం, వ్యాక్సిన్ వేసుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసు శాఖకు వైద్యశాఖ సూచించింది.

మాస్క్ ఖచ్చితంగా ధరించాలని, బహిరంగ ప్రదేశాలతో పాటు ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని ప్రభుత్వం సూచించింది.

ఇక వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేనని, వ్యాక్సిన్ పై ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నామని అధికారులు తెలిపారు.
హోటల్, పార్క్, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా ఇకపై వ్యాక్సినేషన్ పత్రం ఖచ్చితం చేయాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
వ్యాక్సిన్ వేసుకొనివారికి ఎక్కడికెళ్లినా త్వరలో నో ఎంట్రీ రూల్ పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఓమిక్రాన్ కేసులు ఇండియాలో ఐడెంటిఫై అవ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. దానితో పాటు తెలంగాణలోని పలు విద్యాసంస్థల్లో పదులసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరింత ప్రమాదం సంభవించకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోనుంది.

ఓమిక్రాన్ స్ప్రెడ్ అయితే వచ్చే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమని భావించిన ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగానే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నదని సమాచారం.

ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు చేయాల్సిన పనులు ముఖ్యంగా మాస్క్ ధరించడం, శా
సానిటైజేషన్ చేసుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం లాంటివి తప్పకుండా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్ని కేసులు పెరిగినా కరోనా చైన్ బ్రేక్ చేయడానికి ఈ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడుతాయని అభిప్రాయపడుతున్నారు.