Site icon HashtagU Telugu

Bathukamma Sarees: పంపిణీకి కోటికిపైగా బతుకమ్మ చీరలు సిద్ధం

Bathukamma Sarees Imresizer

Bathukamma Sarees Imresizer

తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడంతోపాటు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోంది.
మహిళా సోదరీమణుల సంతృప్తి కోసం ప్రతి ఏటా ఈ చీరలను ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు కోట్ల వ్యయం అవుతున్నా ఈ పద్దతి కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది పంపిణీకి కోటి 18 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి. చేనేత మగ్గాలపై నేసిన చీరలను మాత్రమే బతుకమ్మ చీరలుగా పంపిణీ చేయడం వల్ల చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఆ రకంగా ప్రభుత్వం అటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఇటు మహిళలను సంతృప్తి పరుస్తోంది.

ఈ చీరలను సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు వివిధ రంగుల్లో నేస్తారు. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా రూ.340 కోట్ల వ్యయంతో బతుకమ్మ చీరలు తయారు చేశారు. 240పైచిలుకు వెరైటీ డిజైన్‌లతో రూపొందించిన చీరలు పంపిణీకి సిద్ధం చేశారు. ఈ చీరలు మహిళా సోదరీమణులకు పంపిణీ చేయడానికి టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్ శాఖ సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు వెండి, బంగారు, జరీ అంచులతో తయారు చేయించారు. రాష్ట్ర అవతరణ తర్వాత ప్రతి బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ఈ చీరలు పంపిణీ చేస్తారు. త్వరలోనే చీరల పంపిణీ కార్యక్రమం వివరాలు చేనేత శాఖ వెల్లడించనుంది.