Site icon HashtagU Telugu

Gaddar Demise: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

Gaddar Demise

New Web Story Copy 2023 08 07t014321.179

Gaddar Demise: విప్లవకారుడిగా, గాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఉద్యమ కెరటం ప్రజాయుద్ధనౌక గద్దర్ మరణం ప్రతిఒక్కరిని కంటతడిపెట్టిస్తుంది. తన పాటలతో ప్రజల్ని ఆలోచింపజేసే గద్దర్ తన జీవితకాలంలో అనేక పాటలకు ప్రాణం పోశారు. మరీ ముఖ్యంగా ఆర్‌ నారాయణమూర్తి నటించిన ఓరేయ్ రిక్షా సినిమాలో గద్దర్‌ రాసిన మల్లెతీగకు పందిరి వోలే పాట ఆల్‌టైమ్‌ ఎవర్‌గ్రీన్ సూపర్ హిట్‌గా నిలిచింది. గద్దర్‌ ఈ పాటకు నంది అవార్డు వస్తే.. తిరస్కరించారు. అయితే గద్దర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. జూలై 20, 2023న గద్దర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఆగస్ట్ 3న బైపాస్ సర్జరీ జరిగింది. ఈ రోజు గద్దర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దానికి తోడు గుండెనొప్పి రావడంతో మృతి చెందారు.

గద్దర్‌గా పేరుగాంచిన గుమ్మడి విట్టల్‌రావు అంత్యక్రియలకు అధికారికంగా గౌరవ వందనాలు అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటల ద్వారా సెంటిమెంట్‌ను ప్రతి పల్లెకు తీసుకెళ్లిన గద్దర్ మృతి చెందడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పాటలు, నృత్యాలతో సొంత రాష్ట్రం కోసం చైతన్యం రగిలించిన గద్దర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ అన్నారు. గద్దర్ తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మృతితో యావత్ తెలంగాణ ఓ గొప్ప ప్రజాకవిని కోల్పోయిందని తెలిపారు. తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్‌తో ఆయనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

Also Read: Pawan Condolence To Gaddar : గద్దర్ కొడుకుని హత్తుకొని ఏడ్చేసిన పవన్ కళ్యాణ్