CM KCR: ‘మహిళా బంధు’ కొత్త పథకమా.. కేసీఆర్ వ్యూహమా?

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మరాయి. అందుకే భారీగా ఓట్లు వేసే ఏ వర్గాన్నీ వదులుకోవడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు.

  • Written By:
  • Updated On - March 4, 2022 / 11:04 AM IST

తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మరాయి. అందుకే భారీగా ఓట్లు వేసే ఏ వర్గాన్నీ వదులుకోవడానికి రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓ అడుగు ముందే వేసింది. రాష్ట్రంలో కేసీఆర్ మహిళా బంధును నిర్వహించనుంది. ఈ పేరు వినగానే ఇదేమైనా కొత్త పథకమా అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే రైతు బంధులాగే దీని పేరు కూడా ఉంది. కానీ అసలు మ్యాజిక్ అక్కడే ఉంది.

రాజకీయ వ్యూహాలు పన్నడంలో ప్రత్యర్థులకన్నా పదడుగులు ముందుండే కేసీఆర్ కు.. పదకొండో అడుగు వేయడానికి పీకే ఇప్పుడు జతయ్యారు. దీంతో ప్రచారం ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు మహిళాబంధును కూడా అలాగే నిర్వహించాలని ప్లాన్ చేశారు. కాకపోతే ఇది స్కీమ్ కాదు.. ఇప్పటికే మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు కృతజ్ఞతలు చెప్పడం.

కేసీఆర్ మహిళా బంధు కోసం కొన్ని కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం డిజైన్ చేసింది. ఈనెల 6 నుంచి 8 వరకు ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ నెల ఆరో తేదీన ఈ సంబురాలు ప్రారంభమవుతాయి. ఆరోజున కేసీఆర్ కు మహిళామణులు రాఖీలు కడతారు. డాక్టర్లు, విద్యార్థినులు, ఏఎన్ఎంలు, పారిశుధ్య కార్మికులు, ఆశావర్కర్లను సన్మినిస్తారు. ఇప్పటికే సక్సెస్ అయిన కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల గురించి ప్రజలకు మరింతగా తెలిసేలా.. థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలను ఏర్పాటుచేస్తారు.

ఈనెల ఏడో తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్దిదారులతోపాటు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి లబ్దిదారులను వారి ఇళ్లకే వెళ్లి కలవాలి. వారితో సెల్ఫీలు తీసుకోవాలి. ఈనెల ఎనిమిదో తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేస్తారు. సంబురాలను జరుపుతారు. దీంతో మహిళల్లో కేసీఆర్ పైన, టీఆర్ఎస్ ప్రభుత్వంపైన పెద్ద ఎత్తున కృతజ్ఞతాభావం ఏర్పడుతుందని విశ్వసిస్తున్నారు.