Site icon HashtagU Telugu

Free Power : ఉచిత కరెంట్ ఫై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కండిషన్ ..?

Free Power

Free Power

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఉచిత కరెంట్ ను ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని వెయ్యి కళ్లతో తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల లోపు వారికీ ఫ్రీ కరెంట్ అని హామీ ఇచ్చింది. ఈ హామీ పట్ల ప్రజలు ఎంతో సంబరపడి..ఓట్లు గుద్దేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో పడింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలను అమలు చేసి ప్రజల్లో నమ్మకం పెంచుకుంది. ఇక అతి త్వరలో ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు చెప్పుకొస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో చాలామంది ఫ్రీ కరెంట్ రాబోతుందని చెప్పి..రెండు నెలలుగా బిల్లులు కట్టడం లేదు. ఈ క్రమంలో ఆలా బిల్లులు కట్టని వారికీ షాక్ ఇవ్వబోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉచిత కరెంట్ కావాలంటే పాత బిల్లులు కట్టాల్సిందే అని ఫిట్టింగ్ ప్రభుత్వం పెట్టబోతుందట. వెంటనే ప్రజలు పెండింగ్ బిల్లులు కట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. బిల్లులు కట్టకుంటే ఉచిత కరెంట్ ఇవ్వమని హెచ్చరిస్తున్నారు. అయితే పెండింగ్ బిల్లులు వసూళ్లు చేయడానికే ఈ డ్రామా అని కొంతమంది అంటున్నారు. ఒకసారి బిల్లులు కట్టగానే.. ఎలక్షన్ కోడ్ చెప్పి ఉచిత కరెంట్ పథకాన్ని ఆపేస్తారని.. ఇక పార్లమెంట్ ఎన్నికల తరువాత కూడా.. రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం ఖాయమని బిఆర్ఎస్ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : AP : హరిరామ జోగయ్య లేఖ దుమారం