Site icon HashtagU Telugu

Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం

Telangana Government

Telangana Government

Telangana: తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విలువ అధికంగా ఉండటంతో, వాటిని విక్రయించి పెద్దఎత్తున ఆదాయం పొందాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శేరిలింగంపల్లి మండలం పరిధిలోని రాయదుర్గ్‌లో ఉన్న విలువైన భూములను వేలం వేయనుంది.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) వివరాల ప్రకారం, రాయదుర్గ్ సర్వే నంబర్ 83/1లో గల సుమారు 18.67 ఎకరాల భూమిని ఈసారి అమ్మకానికి ఉంచుతున్నారు. భూముల ధరను ప్రభుత్వం ఎకరాకు రూ.101 కోట్లుగా నిర్ణయించింది. ఈ ధరకు విక్రయం జరిగితే ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1,900 కోట్లు చేరతాయని అంచనా.

S-400 : భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం..ఎస్-400 కొనుగోళ్లకు రష్యాతో చర్చలు

అయితే, రాయదుర్గ్ భూములకు మార్కెట్లో డిమాండ్ బాగా ఉన్నందున, ఈ వేలంలో పెద్దఎత్తున పోటీ నెలకొనే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ పోటీ పెరిగితే నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తంలోనే భూములు అమ్ముడయ్యే అవకాశముంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరింతగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వేలాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. హైదరాబాద్‌లోని రాయదుర్గ్, నానక్‌రాం గూడ, కూకట్‌పల్లి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అధిక విలువ కలిగినవిగా పరిగణించబడుతున్నాయి.

ఈసారి కూడా రాయదుర్గ్ భూముల వేలం పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ బూమ్ అవుతున్న సమయంలో, ప్రభుత్వ భూముల వేలం పెట్టడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, కార్పొరేట్ సంస్థలు ఈ వేలంలో పోటీ పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Ration Dealers : బంద్ కు పిలుపునిచ్చిన తెలంగాణ రేషన్ డీలర్లు

Exit mobile version