Scholarships : 2023-24 విద్యాసంవత్సరం స్కాలర్‌షిప్‌ల అప్లికేషన్లను స్వీకరించే విషయమై తెలంగాణ సర్కార్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఇంతకుముందు ఈ దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్ డిసెంబర్ 31 కాగా.. ఈ గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు అప్పటిలోగా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇప్పటిదాకా స్కాలర్షిప్కు అప్లై చేసుకోలేకపోయిన ఫ్రెషర్లు, రెన్యూవల్ చేసుకోని వారికి ఇది మంచి ఛాన్స్. ఇప్పుడే టీఎస్ ఈపాస్ (TS ePASS) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తులను సబ్మిట్ చేయొచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి(2023-24) సంబంధించి స్కాలర్ షిప్‌లకు(Scholarships) దరఖాస్తుల స్వీీకరణ ప్రక్రియ 2023 ఆగస్టు 19న ప్రారంభమైంది. అప్పటి నుంచి డిసెంబర్ 31 వరకు దరఖాస్తులను తీసుకున్నారు. ఆలోగా దరఖాస్తు చేసుకోలేకపోయిన ఫ్రెషర్లు, రెన్యూవల్ చేసుకోని వారికి మరో అవకాశం ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్రెషర్స్ అప్లై చేయడం ఇలా..
- ఒకవేళ ఫ్రెషర్స్ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేయాలని అనుకుంటే https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- విద్యార్హతను బట్టి స్కాలర్‌షిప్ టైప్‌ను ఎంపిక చేయాలి.
- అందులో ఫ్రెష్ రిజిస్ట్రేషన్, రెన్యూవల్ రిజిస్ట్రేషన్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.
- మీకు అవసరమైన రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- ఫ్రెషర్స్.. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. దాన్ని ఫాలో కావాలి.
- ఆ వెంటనే వెబ్ బ్రౌజర్లో స్కాలర్ షిప్ అప్లికేషన్ ఫామ్ తెరుచుకుంటుంది.
- పూర్తి వివరాలను విద్యార్థులు ఎంటర్ చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
- చివరలో వాటిని ఒకసారి చెక్ చేసుకొని “Submit” చేసేయాలి.
- అప్లికేషన్ ప్రింట్ తీసుకొని, అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ను రాసి ఉంచుకోవాలి.