Formula E Race : `రేస్`తుస్‌! తెలంగాణ స‌ర్కార్ అభాసుపాలు!

తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన `కార్ రేస్` తుస్సుమంది. ఏడాదిన్న‌ర‌గా మంత్రి కేటీఆర్ ఈ రేస్ గురించి ప్ర‌చారం మొద‌లుపెట్టారు.

  • Written By:
  • Updated On - November 21, 2022 / 04:43 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన `కార్ రేస్` తుస్సుమంది. ఏడాదిన్న‌ర‌గా మంత్రి కేటీఆర్ ఈ రేస్ గురించి ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌బోతున్నామ‌ని అంచ‌నాల‌ను పెంచారు. కానీ, ట్రయల్స్ రోజే ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డంతో లోపాలున్న ట్రాక్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.

హుస్సేన్ సాగర్ ఒడ్డున దేశంలోనే మొదటిదైన స్ట్రీట్ సర్క్యూట్ ట్రాక్ ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మించింది. దానిపై ప్రాక్టీస్ రోజే వరుస ప్రమాదాలు జ‌ర‌గ‌డం ప్ర‌తిష్ట‌ను ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు, ఇండియన్ రేసింగ్ ప్రధాన పోటీలు నిర్వహించ‌లేమ‌ని ఇండియన్ రేసింగ్ లీగ్ యాజమాన్యం సోమవారం ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేయ‌డం తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వాకాన్ని నిల‌దీస్తోంది.

Also Read:  Telangana Sit:`క‌మాండ్ అండ్ కంట్రోల్` టెన్ష‌న్!

ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ మోటార్‌‌ స్పోర్ట్స్‌‌ క్లబ్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎఫ్‌‌ఎంఎస్‌‌సీఐ) టెక్నికల్‌‌ అధికారులు ఆరు ఫ్రాంచైజీలతో మాట్లాడి పోటీలను వాయిదా వేయడం జ‌రిగింది. కాగా, ఐఆర్‌‌ ఎల్‌‌లో రెండో, మూడో రౌండ్‌‌ పోటీలు చెన్నైలో జరుగుతాయ‌ని తెలిపింది. చివరి రౌండ్‌‌ వచ్చే నెల 10, 11వ తేదీల్లో తిరిగి హైదరాబాద్‌‌లోనే షెడ్యూల్‌‌ చేశారు. ఇక, ఫిబ్రవరి 11వ తేదీన ఇదే ట్రాక్‌‌పై ఫార్ములా–ఇ రేస్ జరగనుంది.

హైదరాబాద్ వేదికగా తొలిసారి నిర్వహించిన ఇండియన్‌‌ రేసింగ్‌‌ లీగ్‌‌ (ఐఆర్‌‌ఎల్‌‌) తొలి రౌండ్ పోటీలు శని, ఆదివారాల్లో ఒక్కటి కూడా జరగలేదు. కేవలం ప్రాక్టీస్ తోనే సరిపెట్టారు. కొత్త ట్రాక్‌‌పై డ్రైవర్లకు పట్టు దొరక్కపోవడంతో ప్రాక్టీస్ లో మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ట్రాక్‌‌పై 14వ మలుపు వద్ద చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్‌‌ కార్లు ఢీకొనడంతో ఓ మహిళా రేసర్ గాయాలతో ఆసుపత్రి పాలైంది. దాంతో, ఐఆర్‌‌ఎల్‌‌ ప్రధాన రేసులను రద్దు చేయడం మినహా నిర్వాహకులకు మరో మార్గం లేకుండా పోయింది.

Also Read:  CM KCR : వ‌చ్చే నెల‌ కేసీఆర్ ఎన్నిక‌ల శంఖారావం?