Site icon HashtagU Telugu

Telangana : గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెల‌వు

Ganesh Immersion Imresizer

Ganesh Immersion Imresizer

గణేష్ నిమజ్జనం సందర్భంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ రెండో శనివారం పనిదినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై భారీ ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశుడిని కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై 8 క్రేన్లు, ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్లను సిద్ధంగా ఉంచారు. దీంతో పాటు ఎన్టీఆర్‌ మార్గ్‌లో 9, పీపుల్స్‌ ప్లాజా వద్ద 3 క్రేన్‌లను ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. ఈ రూట్ మ్యాప్ ద్వారా విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపుకు తీసుకురావాల్సిన మార్గాలను హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.