Diwali: దీపావళి సెలవును మార్చిన తెలంగాణ ప్రభుత్వం

ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Diwali Pooja

Diwali Pooja

Diwali: ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి సెలవు రోజుని ఈ నెల 12వ తేదీగా నిర్ణయించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే తాజాగా దీపావళి పండగ సెలవు తేదీని తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ముందుగా తాజాగా ఆ తేదీని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రకారం దీపావళి సెలవు నవంబర్‌ 13వ తేదీకి మార్చింది. ఈ మేరకు మార్చిన సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రతి ఏటా తెలంగాణ సర్కార్‌ ఎంప్లాయిస్‌కు ఇచ్చే సాధారణ సెలవుల జాబితాను ముందు సంవత్సరం డిసెంబర్‌లోనే విడుదల చేస్తుంది. ఆ జాబితా ప్రకారం అయితే.. నవంబర్‌ 12వ తేదీనే దీపావళి సెలవు కూడా ఇచ్చారు. అయితే.. తాజాగా పండితుల సలహా మేరకు సెలవు దినాన్ని మార్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు నవంబర్‌ 13వ తేదీకి దీపావళి సెలవు దినాన్ని మార్చారు అధికారులు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది.

  Last Updated: 10 Nov 2023, 03:52 PM IST