Site icon HashtagU Telugu

ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమించిన తెలంగాణ సర్కార్

Telangana Govt Appointed Di

Telangana Govt Appointed Di

రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను నియమించింది తెలంగాణ సర్కార్.కరీంనగర్‌ ఇంచార్జిగా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జిగా దామోదర రాజనర్సింహ, ఖమ్మం ఇంచార్జిగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నియమితులయ్యారు.

వరంగల్‌ ఇంచార్జిగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, రంగారెడ్డి ఇంచార్జిగా శ్రీధర్‌బాబు, హైదరాబాద్ ఇంచార్జిగా పొన్నం ప్రభాకర్, మెదక్ ఇంచార్జిగా కొండా సురేఖ, ఆదిలాబాద్‌ ఇంచార్జిగా సీతక్క, నల్గొండ ఇంచార్జిగా తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్‌ ఇంచార్జిగా జూపల్లి కృష్ణారావులను నియమిస్తున్నట్లు తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

వీరంతా సంబంధిత జిల్లాలో ప్రజాపాలన కార్యకలాపాల, అమలును సమీక్షించి వర్యవేక్షిస్తారని ప్రభుత్వం పేర్కొంది. కాగా, సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా మంత్రులకు జిగ్ జాగ్‌గా జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఏ జిల్లా మంత్రికి కూడా సొంత జిల్లా బాధ్యతలను అప్పగించలేదు. దీని ద్వారా సంక్షేమ పథకాల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కేవలం లబ్ధిదారులకు మాత్రమే ఫలాలు అందుతాయనేది ప్రభుత్వం అభిప్రాయం.

Read Also : IAS Transfers in Telangana : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..