తెలంగాణ గవర్నర్ తమిళ సై ను బదిలీ చేయించేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని టాక్. ఇప్పటికే పలుమార్లు హస్తినకు వెళ్లిన ఆయన పలు మార్గాల ద్వారా ఆమె బదిలీకి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అందుకే, ఆమె ఇటీవల ప్రభుత్వంపై తిరగబడ్డారని తాజాగా ఢిల్లీ వేదికగా చర్చ జరుగుతోంది.తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై మరోసారి ఢిల్లీలో గవర్నర్ తమిళ సై గళం విప్పారు. ప్రొటోకాల్ పాటించకుండా కేసీఆర్ సర్కార్ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోందని అన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని అనలేదు, ఇతర రాష్ట్రాల్లో గవర్నర్లతో విభేదాలున్నా, రాజ్ భవన్‌ను గౌరవిస్తున్నారు’ అంటూ తమిళ సై వ్యాఖ్యానించారు. రోజుల వ్యవధిలోనే రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తమిళిసై సోమవారం ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో ఏనాడూ టీఆర్ఎస్ సర్కారుపై చేయనంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుందని ఆమె చెప్పుకొచ్చారు. ‘నేను రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారంటూ ప్రభుత్వ వ్యతిరేకగళం విప్పారు. ఫలితంగా మరోసారి సంచలనంగా రాజ్ భవన్, ప్రగతిభవన్ వ్యవహారం మారింది.
Telangana Governor Tamilisai : తెలంగాణ గవర్నర్ బదిలీ?

tamilisai and kcr