Tamilisai Soundararajan : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ పదవితో పాటు , పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి సైతం రాజీనామా చేశారు తమిళిసై సౌందర్‌రాజన్‌ (Tamilisai Soundararajan). తన రాజీనామా (Resign) లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారని వినికిడి. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. చెన్నై సెంట్రల్‌ (Central Chennai) లేదా తూత్తుకూడి ( Puducherry ) నుంచి బీజేపీ (BJP) నుండి ఆమె పోటీ చేయబోతున్నట్లు సమాచారం. తమిళిసై […]

Published By: HashtagU Telugu Desk
Tamilasai Resign

Tamilasai Resign

తెలంగాణ గవర్నర్ పదవితో పాటు , పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి సైతం రాజీనామా చేశారు తమిళిసై సౌందర్‌రాజన్‌ (Tamilisai Soundararajan). తన రాజీనామా (Resign) లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారని వినికిడి. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. చెన్నై సెంట్రల్‌ (Central Chennai) లేదా తూత్తుకూడి ( Puducherry ) నుంచి బీజేపీ (BJP) నుండి ఆమె పోటీ చేయబోతున్నట్లు సమాచారం. తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా తమిళసై ఎన్నికయ్యారు. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా భాద్యతలు చేపట్టింది. 1961 జూన్ 2న కృష్ణ కుమారి, కుమార్ అనంతన్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ ప్రాంతంలో తమిళసై జన్మించింది. ఈమె తండ్రి కుమారి అనంత‌న్ మాజీ లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు.ఆమె వృత్తి రీత్యా వైద్యులు.

ఈమెకు చిన్నతనం నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. తన ఎంబీబీఎస్ విద్యను మద్రాస్ వైద్య కళాశాలలో చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసి, బిజెపి సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరింది. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007 లో బిజెపి ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర భారతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, 2013 లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014వ సంవత్సరం నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. 2006, 2011 లో రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా, 2009, 2019 లో రెండుసార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దమైనట్లు..అందుకే తమ గవర్నర్ పదవికి రాజీనామా చేసిందని చెపుతున్నారు.

Read Also : Flipkart: ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఎదురుదెబ్బ.. గ‌త రెండేళ్ల‌లో త‌గ్గిన కంపెనీ మార్కెట్ విలువ‌

  Last Updated: 18 Mar 2024, 12:26 PM IST