Tamilisai Soundararajan : హుస్సేన్ సాగర్‌పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. కంపు కొడుతోంది.. తెలంగాణ ప్రభుత్వానికి చురకలు..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇండైరెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి చురకలు వేస్తూ హుస్సేన్ సాగర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - July 9, 2023 / 08:30 PM IST

హుస్సేన్ సాగర్(Hussain Sagar) వద్ద 37వ సెయిలింగ్ వీక్(Sailing Week) ముగింపు కార్యక్రమం జరగగా తెలంగాణ(Telangana) గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai Soundararajan) ముఖ్య అతిథిగా వచ్చారు. సెయిలింగ్ వీక్ విన్నర్స్ కి బహుమతులు అందించారు. ఈ నేపథ్యంలో ఇండైరెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి చురకలు వేస్తూ హుస్సేన్ సాగర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

37వ సెయిలింగ్ వీక్ ముగింపు కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజేతలకు బహుమతులు అందించి అభినందనలు తెలిపిన అనంతరం మాట్లాడుతూ.. హుస్సేన్ సాగర్ అనేది తెలంగాణకే ఒక బహుమానం. పకృతి ఇచ్చిన వరం. అలాంటి  హుస్సేన్ సాగర్ ఇప్పుడు కంపుతో నిండి పోయింది, హుస్సేన్ సాగర్ ని క్లీన్ చెయ్యవలసిన అవసరం ఉంది. ఇది ఒక మదర్ లేక్ కూడా. ఎంతో మంది ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను ఈ సాగర్ లేక్ మనకు ఇచ్చింది కాబట్టి ఇలాంటి హుస్సేన్ సాగర్ ని క్లీన్ గా ఉంచడం ప్రభుత్వం బాధ్యత. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు ఆర్మీ మాత్రమే కాదు ఇది ప్రజలు కూడా తమ బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అంతర్జాతీయ వేదికలకు సిద్ధమవుతున్న సెయులర్స్ కి కూడా వేదిక అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయాలి. ప్రతి ఏడాది సెయిలింగ్ క్లబ్ వీక్ పోటీలకు ముఖ్య అతిథిగా వస్తాను వచ్చే సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈసారి అధికారుల నుంచి చాలా క్లీన్ గా ఉందనే విషయాన్ని వినాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు.

దీంతో ఎప్పటిలాగే ఇండైరెక్ట్ గా తెలంగాణ ప్రభుత్వానికి చురకలు వేశారు. అయితే చురకలు వేసినా ఈ సారి మాత్రం నిజం మాట్లాడారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఎంత డెవలప్ చేస్తున్నా లేక్ పరిస్థితి ఏంటో మన అందరికి తెలిసిందే. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Also Read : Lashkar Bonalu: నగరంలో అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు