Site icon HashtagU Telugu

Governor Tamilisai: గర్భిణులు కచ్చితంగా రామాయణం చదవాలి: గవర్నర్ తమిళిసై!

Tamilisai

Tamilisai

గర్భిణులు ‘సుందరకాండ’ పఠించాలని, అప్పుడే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న పిల్లలు పుడుతారని తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అన్నారు. నిన్న ‘గర్భ సంస్కార్’ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “గ్రామాల్లో, రామాయణం, మహాభారతం, ఇతర ఇతిహాసాలతో పాటు మంచి కథలను చదివే తల్లులను మనం చూశాం. ముఖ్యంగా తమిళనాడులో గర్భిణీ స్త్రీలు రామాయణంలోని సుందరకాండాన్ని నేర్చుకోవాలని ఆసక్తి చూపుతారు’’ అని తమిళిసై అన్నారు. గర్భధారణ సమయంలో “సుందరకాండ” పఠించడం “పిల్లలకు చాలా మంచిది” తెలిపింది.

హనుమంతుని సాహసాలు, అతని నిస్వార్థత, బలం శ్రీరాముని (Ramayanam) పట్ల భక్తిని వర్ణిస్తుంది. గర్భధారణ సమయంలో యోగా సాధన చేయడం వల్ల గర్భంలో తల్లి, బిడ్డ ఇద్దరి శారీరక, మానసిక బంధాన్ని ఏర్పరుస్తుంది. ‘గర్భ సంస్కార్’ కార్యక్రమంలో భాగంగా వైద్యులు కాబోయే తల్లులకు (Mothers) “శాస్త్రీయ, సాంప్రదాయ” ప్రిస్క్రిప్షన్‌ల మిశ్రమాన్ని అందిస్తారు, తద్వారా ఉన్నత విలువలతో పిల్లలు పుడతారు.

ఈ కోర్సులో భగవద్గీత వంటి మతపరమైన గ్రంథాలను చదవడం, సంస్కృత మంత్రాలను పఠించడం, యోగా సాధన వంటివి ఉంటాయి. ఈ ప్రక్రియ గర్భధారణకు ముందు నుండి ప్రసవ దశ వరకు ఉంటుంది. శిశువుకు (Baby Girls and boys) రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కొనసాగుతుంది.‘గర్భ సంస్కార్’ కాబోయే తల్లుల కుటుంబ సభ్యులు కూడా అవసరమైన సలహాలు, సూచనలను అందిస్తుంది. మహిళలు గర్భధారణ సమయంలో పలు గ్రంథాలను చదవడం, వారి మనసుపై ప్రభావం చూపి సానుకూల ఆలోచనలు కలిగేలా చేస్తాయని పలు సర్వేలు కూడా చెప్పాయి.

Also Read: Nayanthara: నయనతార గ్లామర్ సీక్రెట్స్ ఏంటో మీకు తెలుసా!