Site icon HashtagU Telugu

TS Govt Key Decision: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం…సెప్టెంబర్ నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులే..!!

Government Of Telangana Logo

Government Of Telangana Logo

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా ఉన్న విలేజ్ రెవెన్యూ సహాయకులను…ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి కమిటీ తమ రిపోర్టును ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించినట్లుగా సమాచారం. ఈ కమిటీకి శేషాద్రి నేతృత్వం వహించారు. వీరిని సెప్టెంబర్ మొదటి వారంలోగా క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21వేల మంది VRAలు ఉండగా….పదోతరగతి, ఆపైన విద్యార్హత ఉన్న 9వేల మందికి మాత్రమే ఈ పదోన్నతులు దక్కనున్నట్లు సమాచారం. కాగా రెండేళ్ల కిందే వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తామని సర్కార్ చెప్పినా…ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఈ వ్యవహారంపై కదలిక మొదలు అయ్యింది. 33 జిల్లాల వారిగా సీసీఎల్ఏ ప్రాధమిక సమాచారాన్ని సేకరించింది.

ఈ క్రమబద్దీకరణ ప్రకారం వీఆర్ఏలకు పేస్కేలు చెల్లిస్తారు. కానీ ఇప్పటి వరకు వేతన వివరాలు ఖరారు కాలేదని రెవెన్యూ శాఖ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 23,046మంది వీఆర్ఏలు ఉన్నారు. వారిలో 21,433మంది విధుల్లో ఉన్నారు. టెన్త్ చదివినవారు 3,756కాగా…ఇంటర్ 2,343,డిగ్రీ 1951, పీజీ 858 మంది ఉన్నారు. 9వ తరగతి వరకు చదవినవారు 7,200మంది ఉన్నారు.

విద్యార్హత లేని వారు 5,226 మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. టెన్త్ చదివినవారికి వెంటనే పదోన్నతులు కల్పించే యోచనలో ప్రభుత్వం ఉంది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా వీరిని ధరణి ఆపరేటర్లుగా నియమించనున్నారు. కొందరిని నీటిపారుదల రంగంలో, ఇంకొందరిని తహసీల్దారు కార్యాలయంలో సర్దుబాటు చేసే అవకాశం ఉంది.