Site icon HashtagU Telugu

SSA Employees Protest : సమగ్ర శిక్షా ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం?

Ssa Employees Protest

Ssa Employees Protest

తెలంగాణ ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ (SSA Employees) ఉద్యోగులపై సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తోంది. గత 25 రోజులుగా ఉద్యోగులు (Samagra Shiksha Abhiyan employees) విధులకు హాజరుకాకుండా సమ్మె చేపట్టడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంది. సమ్మె వల్ల పాఠశాలల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలుగుతుందని విద్యాశాఖ అధికారుల అభిప్రాయపడుతున్నారు.

Temperature : ఉమ్మడి మెదక్ జిల్లాను చంపేస్తున్న చలి పులి..!

ఈ క్రమంలో ప్రభుత్వం ప్రస్తుతం సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా సాధ్యపడదని తేల్చింది. ఈ నేపథ్యంలో, విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తున్న ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగులను నియమించే ఆలోచన జరుగుతున్నట్లు సమాచారం.

ఉద్యోగులు తమ డిమాండ్లపై (Regularization of their services, increase in pay scale) పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. సుమారు నెల రోజులుగా సమ్మె కొనసాగుతున్నప్పటికీ, వీరి సమస్యలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు తక్షణమే విధులకు హాజరుకావాలని ఇటీవల ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా, వారినుండి స్పందన రాలేదని తెలుస్తోంది.

Temperature : ఉమ్మడి మెదక్ జిల్లాను చంపేస్తున్న చలి పులి..!

ఈ పరిణామం పట్ల సమ్మె చేస్తున్న ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ఇలా తొలగింపు చర్యలు తీసుకోవడం అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నట్లు సమ్మె కమిటీ ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం విద్యావ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది చూడాలి. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే టెన్షన్ అందరిలో నెలకొంది.