TG SC Classification GO : తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవోను న్యాయశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలులోకి రానుంది. ఈ నెల 8న ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. ఎస్సీ వర్గీకరణపై నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్-ఏ కింద ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉప కులాలకు గ్రూప్-బీ కింద ఉన్న వారికి 9 శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలను గ్రూప్-సీ కింద ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఇక, దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జీఓ విడుదల చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపగా, ఆ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదం తెలిపారు.
మూడు గ్రూపుల విభజన, రిజర్వేషన్లు ఇలా..
.గ్రూప్-ఏలో ఉన్న వారికి ఒక్క శాతం రిజర్వేషన్
.గ్రూప్-బీలో ఉన్న వారికి 9 శాతం రిజర్వేషన్
.గ్రూప్-సీలో ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది.
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నాం. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తదితరులు ఉన్నారు.
ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నాం. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు.
Read Also: Gold Price : హమ్మయ్య.. 5 రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర