Telangana: తెలంగాణలో కొత్తగా మ‌రో 13 మండలాలు..!

తెలంగాణలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Written By:
  • Updated On - September 27, 2022 / 12:33 PM IST

Telangana: తెలంగాణలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జులైలో ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసింది.
జిల్లాల వారీగా కొత్త మండలాల‌ను ప్ర‌క‌టించింది. ఆ మండ‌లాలెంటో చూద్దాం.

జ‌గిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్‌, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్‌, మహబూబాబాద్‌ జిల్లాలో సీరోలు, ఇనుగుర్తి, సిద్దిపేట జిల్లాలో అక్బర్‌పేట-భూంపల్లి, కుకునూరుపల్లి, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, నిజామాబాద్ జిల్లాలో ఆలూర్‌, డొంకేశ్వర్‌, సాలూరా, మహబూబర్‌నగర్‌ జిల్లాలో కౌకుంట్లను మండ‌లాలుగా ప్ర‌క‌టించింది.