Site icon HashtagU Telugu

Schools Re Open : తెలంగాణ 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ విడుదల.. ఎన్ని రోజులు సెలవులు, ఎన్ని రోజులు వర్కింగ్ డేస్??

Telangana Government Released 2023 to 2024 Educational year shedule

Telangana Government Released 2023 to 2024 Educational year shedule

స్కూల్ విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్(Summer Holidays) మరికొన్ని రోజుల్లో ముగియనున్నాయి. ఇప్పటికే జూన్ 12 నుంచి స్కూల్స్ అన్ని రీ ఓపెన్ అవుతాయని తెలంగాణ(Telangana) విద్యాశాఖ ప్రకటించారు. తాజాగా నేడు 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ ని విడుదల చేశారు.

తెలంగాణ 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి మొదలవుతుంది. ఏప్రిల్ 24 చివరి పనిదినం. 2023-24లో మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి. 2024 జనవరి పది వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఇవి కాకుండా ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు మామూలే. ఇక ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగ, ధ్యానం కచ్చితంగా పిల్లలంతా చేసేలా చూడాలని నిర్ణయించారు.

 

Also Read : AP Schools: ఏపీలోని పాఠశాలలకు మే 1 నుంచి వేసవి సెలవులు.. జూన్ 12న రీ ఓపెనింగ్..!