Rural Development: గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తోంది. ఇటు రోడ్ల నిర్మాణానికి వేల కోట్ల నిధులు, అటు ఇంజనీర్లకు వాహన సదుపాయం కల్పిస్తుంది. మంత్రి సీతక్క కృషితో పల్లెలకు నిధుల వరద పారుతోంది. గ్రామాల అభివృద్ధికి (Rural Development) రేవంత్ సర్కార్ గతంలో రూ. 2682.95 కోట్లను మంజూరు చేయగా.. తాజాగా గురువారం మరో రూ. 2773 కోట్లను మంజూరు చేసింది. దీంతో పల్లెల్లో ప్రగతి పనులు పరుగులు పెట్టనున్నాయి.
తాజాగా మంజూరు చేసిన రూ. 2773 కోట్లలో సీఆర్ఆర్ రోడ్ల కోసం రూ. 1419 కోట్లు, ఎంఆర్ఆర్ నిధులు రూ. 1288 కోట్లు, పీఎం జన్ మన్ రాష్ట్ర వాటా కింద రూ.66 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జన్ మన్ నిధులతో 25 ఆదివాసీ గుడాలకు బీటీ రోడ్లు వేయనున్నారు. తాజాగా మంజూరు చేసిన నిధులతో పల్లెల్లో మౌళిక సదుపాయాలు మెరుగుకానున్నాయి. బీటీ రోడ్లు, ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, తండాలు, గూడేల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ఈ నిధులు మంజూరు అయినట్లు తెలుస్తోంది.
Also Read: Royal Enfield Scram 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్.. ధర ఎంతంటే?
డిప్యూటీ సీఎంకు మంత్రి సీతక్క ధన్యవాదాలు
గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్కను ప్రజా భవన్ లో కలిసి పూల మొక్క అందచేసి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. పల్లెల అభివృద్దికి పెద్ద పీఠ వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, సహచర మంత్రులకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. ఎన్నడు లేని విధంగా నిధులు మంజూరు చేసిన పనులు చేయిస్తున్నామన్నారు. మొదటి విడతలో రూ. 2682 కోట్లు కేటాయించామని, తాజాగా మరో రూ. 2773 కోట్లు మంజూరు చేశామని ఆమె వివరించారు. ఇవే కాకుండా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.197 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో పీఎంజీఎస్‌వై కోసం రూ. 110 కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. పల్లెల్లో రోడ్లు, డ్రేనేజీలు, ఇతర మౌళిక వసతుల కల్పన కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
రాబోయే కాలంలో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయి పంచాయతీ రాజ్ రూరల్ ఇంజనీరింగ్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం వాహన సదుపాయం కూడా కల్పించింది. పనుల పర్యవేక్షణ కోసం ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఎస్ఈలకు వెహికిల్స్ సదుపాయం కల్పించారు. 237 మంది ఇంజనీరింగ్ అధికారులకు రూ. 5 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో వాహన అద్దె చెల్లింపున కోసం నెలకు రూ.33 వేలు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.