Site icon HashtagU Telugu

Telangana Government : రాష్ట్రంలో మ‌రో ఎనిమిది కొత్త ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలు.. ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం

Cm Kcr

Cm Kcr

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో ఎనిమిది ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ (Government Medical College) లు మంజూరు అయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలకు అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ‌లో జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేస్తామ‌ని గ‌తంలో సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. ప్ర‌తిజిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 34 మెడికల్ కాలేజీలతో దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. తొమ్మిదేళ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పది వేలకు చేరువ‌య్యాయి. మారుమూల ప్రాంతాలకుసైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వ‌చ్చాయి. కొత్త‌గా మ‌రో ఎనిమిది మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం ప‌ట్ల సీఎం కేసీఆర్‌కు మంత్రి హ‌రీష్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని మంత్రి వాఖ్యానించారు.

Transfer Whatsapp Chats: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఆ ఆప్షన్ తో చాట్స్ బదిలీ?

Exit mobile version