Site icon HashtagU Telugu

Sun Burn Festival: సన్‌బర్న్ ఫెస్టివల్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. అయినా భేఖాతర్

Sunburn Event

Sunburn Event

Sun Burn Festival: సన్ బర్న్ ఫెస్టివల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే టిక్కెట్లు అమ్మకానికి పెట్టడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు డిసెంబర్ 31న సన్ బర్న్ అనే పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ సన్ బర్న్ ఈవెంట్స్ వివిధ దేశాల్లో జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే బాగా డబ్బున్న యువత, పార్టీలు, వినోదాల పట్ల ఆసక్తి ఉన్నవారు మాత్రం సన్‌బర్న్ ఫెస్టివల్‌కు ఎంతకైనా తెగిస్తారు. అందుకే మంచి ఆదరణ లభిస్తోంది.

Sunburn Event

2024కి స్వాగతం పలికేందుకు సన్‌బర్న్ నిర్వాహకులు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో డిసెంబర్ 31 రాత్రి 8 గంటలకు ఏర్పాట్లు చేశారు. బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో టిక్కెట్ల విక్రయం కూడా ప్రారంభమైంది. డ్రగ్స్ ఉండదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అందిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఎంత చెప్పినా అనుమతులు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన పోలీసులు కేసు పెట్టారు. చివరకు టిక్కెట్ల విక్రయాన్ని నిలిపివేశారు. ఈవెంట్ రద్దు చేయబడటం ఖాయం.ఈ ఏడాది 31వ తేదీన సన్‌బర్న్ ఫెస్టివల్ నిర్వహణకు గోవా అనుమతి నిరాకరించింది. ఈ పండుగను మాదక ద్రవ్యాల విక్రయాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే గతంలో కొందరు న్యాయ పోరాటం కూడా చేశారు.

Also Read: Snake vs Pregnant Woman : గర్భవతిని పాము ఎందుకు కాటు వేయదో మీకు తెలుసా?